Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని పల్లిపాడు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం సీపీఐ(ఎం) కొణిజర్ల, వైరా మండల కమిటీల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబులకు స్థానికులు సమస్యలు తెలిపారు. ఇండ్లలోకి నీరు చేరి మురికివాడలను తలపిస్తున్నాయని అసలే పనికిరాని భూముల్లో నాణ్యత లేకుండా కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎప్పుడు కూలుతాయేనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఇలా ఉండగా దోములతోపాటు పాములు, తేళ్ళు, ఇండ్ల చూట్టూ తిరుగుతున్నాయని చిన్న పిల్లలను కాటేస్తాయేమోనని భయంగా ఉందని నాయకులకు ఓర్సు లక్ష్మీ, చల్లా ధనలక్ష్మి, సఫావత్ ఆరుణ లతోపాటు స్థానిక మహిళలు తమగోడు వెళ్లబోసుకున్నారు. పలు దఫాలుగా మున్సిపాలిటీ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే రాములు నాయక్ దృష్టికి తమ సమస్యలపై విన్నవించిన పరిష్కరం దొరకలేదని వాపోయారు. అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపాల్టీ సిబ్బంది సేకరించిన చెత్తను తీసుకొని వచ్చి తమ ఇండ్లవద్ద పోస్తున్నారని దీంతో దోమలు వ్యాప్తి చెందడంతో రోగాల భారిన పడి ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం సిపిఎం నాయకులు భూక్యా వీరభద్రం బొంతు రాంబాబులు మాట్లాడుతూ సిసిరోడ్డులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాపు నీళ్ళు ఇండ్ల చూట్టూ అగకుండా శాశ్వతమైన డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇండ్ల చూట్టూ నీళ్ళు ఆగడంతో చెరువులను తలపిస్తున్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలల్లో నివాసించే నిరుపేదల ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పల్లిపాడు నుంచి వైరా మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తాళ్లపల్లి క్రిష్ణ, వైరా టౌన్ సెక్రటరీ సుంకర సుధాకర్, చింతనిప్పు చలపతిరావు, పారుపల్లి శ్రీనాథ్, రాచబంటి బత్తిరన్న, దామా వెంకటేశ్వరరావు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.