Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఓ జవాన్ కు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలోని బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఇందులో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. జిల్లాలోని బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ సమీపంలో సీఆర్పీఎఫ్ రహదారి ప్రారంభోత్సవాన్ని దెబ్బతీసే లక్ష్యంతో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. బీజాపూర్ ఎస్పీ కమలలోచన కశ్యప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో సీఆర్పిఎఫ్ జవాన్ షీల్చంద్ మింజ్ గాయపడ్డారు. అతను జాస్పూర్ నివాసి. గాయపడిన జవాన్‌కు బసగూడ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. బసగూడలో ప్రథమ చికిత్స తర్వాత, చౌపర్ నుండి రాయపూర్‌కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లడం జరిగిందని ఎస్పీ ధృవీకరించారు.