Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్రంలో 22 శాతం ఉన్న మున్నూరు కాపు కుల బాంధవుల కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం మండల కన్వీనర్ పూదోట సూరిబాబు డిమాండ్ చేశారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ పూదోట సూరిబాబు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ఆదినారయణకు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు, రెవిన్యూ అధికారులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలని ఆయన అన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మున్నూరు కాపు కుల బాంధవులు బోనాసి వెంకటేశ్వరరావు, పత్తివాడ జగదీష్, కొమ్ము బాలకృష్ణ, చిర్తాని శేఖర్, కొమ్ము సురేందర్, శ్రీనివాసరావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : రూ.వెయ్యి కోట్ల నిధులతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ ప్రదర్శనగా తరలి వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లూధర్ విల్సన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రోకటి సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కోశాధికారి బాపట్ల మురళి, నాయకులు బొడ్డు కృష్ణయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, రామారావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : రాష్ట్రంలోని మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కృష్ణవేణికి వినతి ఈ పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం పట్టణ కోఆర్డినేటర్ పాలెపు ఆనంద్ మాట్లాడారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు రాజేందర్, దంతాల ఆనంద్, ఆర్ జగన్నాధం, యాదగిరి రాంబాబు, చందు నల్ల సత్యం, పింగళి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.