Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పల్లి చంద్రయ్య
నవతెలంగాణ-మణుగూరు
గత 25 సంవత్సరాల నుండి నివాసం వుంటున్న రేగులగండి చెరువు గ్రామానికి మౌళిక వసతులు కల్పించాలని మణుగూరు ఫస్ట్ కోర్టును ఆశ్రయించారు. వెంటనే మౌళిక వసతులు ఎందుకు కల్పించడంలేదో వివరాలు తెలపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పుటికీ అధికారులు స్పందించకపోవడం దారుణమని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పల్లి చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు గుండి భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కోర్టు ఇచ్చిన అర్డర్ కాఫిని డిప్యూటీ తహసీల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జులై 2వ తేదీన జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జీ శ్యాంసుందర్ జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్, గ్రామపంచాయతీ అధికారులు ఎందుకు మౌళిక సదుపాయలు కల్పించలేకపోతున్నారో వివరాలు తెలపాలని కోర్టు అదేశించినప్పటికీ ఇంత వరకు ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. వర్షకాలం సీజన్ కావడంతో గ్రామంలో తాగడానికి నీరు లేక టైపాయిడ్, విద్యుత్ సౌకర్యం లేక దోమకాటుకు గురై గ్రామస్తులు విషజ్వరాల భారీన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక వైద్య, ఇతర పనులకు వెళ్లాని అంటే ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్, రోడ్డు, మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడకం మల్లేష్, గుండి పాసయ్య, చీమల రమేష్, సోడెం భద్రయ్య, కారం జోగయ్య, కారం భీమయ్య తదితరులు పాల్గొన్నారు.