Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో
మోడీతో పోటీపడుతున్న కేసీఆర్
అ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శికూనంనేని
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలో విష జ్వరాలు, వరదలతో జనం అల్లాడుతుంటే అధికార టీఆర్ యస్ జెండా పండుగ నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాచలం సీపీఐ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి కూనంనేని ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఓట్లు, సీట్లు, పండుగ సంబరాలకే పరిమితమవుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో కేంద్రంలోని మోడీ సర్కారుతో పోటీపడుతూ కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములను, ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఆస్తులను అమ్మేసి తమ ఖాజానాను నింపుకునే కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. అదేవిధంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్‌లు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో పోడు సమస్య తీవ్రమవుతుందని, అనాదిగా పోడు సాగు చేసుకుంటున్న పేదలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా భూములను లాక్కునే ప్రయత్నంలో దాడులకు, నిర్బందాలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్ణయాల అమలులో భాగంగా ధరణి పోర్టల్ లోపాలను సరిచేయలని 3న జరిగే ఆందోళన, 7న జరిగే ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ చలో హైదరాబాద్ కార్యక్రమం, 11 నుంచి 17 వరకు జరిగే తెలంగాణ సాయుధ పోరాట వార్సికోత్సవాలు, బస్సు యాత్ర, పోడు యాత్రల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఏపూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, కె.సారయ్య, వెంకటేశ్వరరావు, లక్ష్మీకుమారి, వెంకటేశ్వరరావు, రవికుమార్, సలీం, ప్రసాద్, వై.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.