Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సెప్టెంబర్ 24 స్కీమ్ వర్కర్ల జాతీయ సమ్మె
అ సెప్టెంబర్ 25న భారత్ బంద్
అ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎం.సాయిబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
బీజేపీ నాయకత్వంలో సాగుతున్న కేంద్ర ప్రభుత్వ పాలనలో మాటల్లో దేశభక్తిని వల్లెవేస్తూ చేతలన్నీ దేశ వ్యతిరేకంగా ఉన్నాయని, దేశ సంపద మొత్తాన్ని నరేంద్ర మోడీ విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని దేశ సంపదను కాపాడు కోవడం కోసం రైతులు కార్మికులు సంఘటిత ఉద్యమాలు ఉధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు పిలుపు నిచ్చారు. గురువారం మంచికంటి భవన్లో సీఐటీయూ జిల్లా వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 24వ తేదీన స్కీమ్ వర్కర్ల జాతీయ సమ్మె లేబర్ కోడ్లు వ్యవసాయ విద్యుత్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25వ తేదీన భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వ పాలనను స్తంభింప చేయాలని పిలుపు నిచ్చారు. రూ.6 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రోడ్లు విద్యుత్ గ్యాస్ పైపులైన్లు రైల్వే వంటి జాతీయ సంపదను అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రామికుల ప్రజల శ్రమ ద్వారా సాధించుకున్న ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తున్న మోడీ అతిపెద్ద దేశద్రోహి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో సెప్టెంబర్ 8 నుండి పాదయాత్ర అలాగే రాష్ట్ర స్థాయి ప్రచార జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కీమ్ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రం దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు కార్మిక పోరాటాలు పట్ల కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న పాశవిక దాడులు ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లి క్షేత్రస్థాయి పోరాటాలు నిర్మించాలని సీఐటీయూ శ్రేణులను పిలుపు నిచ్చారు. ఈ వర్క్ షాప్‌కు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి. అప్పారావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ఏజే.రమేస్, పద్మ, కె.బ్రహ్మచారి, కె.శ్రీధర్, గద్దల శ్రీను, పిట్టల అర్జున్, నాయకులు చిలకమ్మా, కిరణ్, సుల్తానా, దుర్గమ్మ, నాగరాజు, ఝాన్సీ, సుశీల నరసింహారావు, వీరన్న, కనకం వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.