Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏడాదిగా ముందుకు కదలని చక్రాలు
అ అనుమానంగా చూస్తున్నారు...!
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం బస్టాండ్‌లో అద్దె బస్సు గత ఏడాదిగా కదల కుండా ఉన్నచోటే ఉంది. కరోనా నేపద్యంలో ఆర్టీసీ బస్సులు కొంత కాలం నడువలేదు. ఇటీవల ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి. అయినప్పటికీ సంవత్సర కాలంగా బస్సుచక్రాలు ముందుకు కదలలేదు. కొన్ని అద్దెబస్సులు నడుస్తున్నప్పటికీ టీఎస్-04, యూఎస్-4059 నెంబర్‌గల బస్సు మాత్రం ఇక్కడే ఉంటుందని, ఇతర ప్రయివేటు బస్సు కార్మికులు తెలుపుతున్నారు. సంబంధిత బస్సు ఓనర్ ఎవరో తెలియదని, ఆర్టీసీ అధికారులు సైతం ఈ బస్సును ఏడాది కాలంగా ఓనర్ ఎందుకు ఇక్కడ నిలిపి ఉంచాడని ప్రశ్ని ంచిన పరిస్థితి లేదని తెలుస్తుంది. ఇప్పటికే బస్టాండ్ ఆవరణం ఆర్టీసీ బస్సుల కంటే ప్రయివేటు వాహనాల పార్కింగ్‌తోనే దర్శన మిస్తున్నాయి. కార్లు ఇష్ట్యారాజ్యంగా పార్కింగ్‌చేసి ఇరతప్రాంతాలకు వెలుతున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న సైకిల్‌స్టాండ్ వారికి టోకన్ ఖరీదుచెల్లించడం లేదని వారు లబోదిబో అంటున్నారు. ఇప్పటికైన ఆర్టీసీ అధికారు ఆర్టీసీకి సంబంధం లేని ప్రయివేటు వాహనాలు ఎందుకు ఉంటున్నాయిని విచారించల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.