Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
జనం ఓట్లు వేసి గెలిపిస్తే ఆ జనంపై ప్రతి రోజూ ధరలు వేస్తున్న మోడీ ప్రభుత్వం సిగ్గు పడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం సరితా క్లీనిక్ సెంటర్ లో పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశాన్ని నిస్సిగ్గుగా తాకట్టు పెట్టడం బిజెపి ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. దేశభక్తి పేరుతో దేశ సంపదను, దేశ ప్రభుత్వ రంగాలను, లాభాల్లో వున్న పరిశ్రమలను అమ్మాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం చేయడం పెద్ద దేశద్రోహం అని అన్నారు. ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం అత్యంత దుర్మార్గం అని విమర్శించారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, నాయకులు కళ్యాణం నాగేశ్వరరావు, వై విక్రమ్, నర్రా రమేష్, బి సుదర్శన్, డి.వీరబాబు, కె.వెంకన్న, భద్రం, చిరంజీవి, మల్లికార్జున్ రెడ్డి, సాగర్, బిబీ, కస్తూరి, వాసు పాల్గొన్నారు.