Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద గూడెం న్యాయవాదుల ఒకరోజు దీక్ష
- సంఘీభావం తెలిపిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ప్రతినిధులందరూ, హైద్రాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద సెక్షన్ 41(ఏ) సిఆర్పిసీని తొలగించాలని, లేదా సవరణ చేయాలని కోరుతూ ఒకరోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ సెక్షన్ 41 (ఏ) సీఆర్పీసీ పోలీసులు వారికి ఇష్టం వచ్చిన వారికి నోటీసులు ఇచ్చి, వెంటనే జామిని స్వీకరించి పంపుతారని, తద్వారా శిక్ష దుర్వినియోగం చేస్తున్నారని, ఈ సెక్షన్ను వెంటనే తొలగించాలని, దీని వల్ల ఫిర్యాదు దారులకు శాపంగా మారిందని, అవసరమైన వారికి నోటీసులు ఇచ్చి, అమాయకులను కోర్టులో రిమాండ్ చేస్తున్నారని వాపోయారు. ఈ దీక్ష కార్యక్రమంలో కొత్తగూడెం ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ సునీల్ గౌడ్, ప్రకాష్ సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయవాది మారపక రమేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసి దీక్షను జయప్రదం చేశారు. న్యాయవాదుల దీక్షలకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంఘీభావం తెలిపారు.
కొత్తగూడెంలో సిఆర్పిసి 41 ఏ రద్దు కోరుతు న్యాయవాదుల దీక్ష....
సిఆర్పిసి 41 (ఏ) ను రద్దు చేయాలని కోరుతూ కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు ఎదుట ఒకరోజు దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షల కోసం న్యాయవాద సంఘలు ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు యండి.సాదిక్ పాషా, కాసాని రమేష్, అరకల కరుణకర్, యన్.పి.చౌదరి, ఉప్పుశెట్టి సునిల్, ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో న్యాయవాదులు రమేష్ కుమార్ మక్కడ్, జలసూత్రం శివరాం ప్రసాద్, కటకం పుల్లయ్య, జివికే. మనోహర్ రావు, గాజుల రాంముర్తి, జనపరెడ్డి గోపికృష్ణ తదితరులు మాట్లాడారు. 41 (ఏ) సిఆర్పిసి వల్ల 7 సంవత్సరాల లోపు శిక్షలు గల నేరాలకు స్టేషన్లో బెయిల్ ఇచ్చే విధానం అమలులో ఉందని ఈ ప్రక్రియ కక్షి దారులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని, బెయిల్ పొందడంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఈ పద్ధతి ద్వారా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 41 ఏ ప్రకారం స్టేషన్ బేయిల్ విధానాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రేపాక వెంకటరత్నం, వెలగల నాగిరెడ్డి, భాగం మాధవరావు, గోద రామచంద్రారెడ్డి, అనుబోలు రాంప్రసాద్, యస్వి.రామారావు, రావిలాల రామారావు, తిరునగరి వెంకటేశ్వర్లు, సిహెవి. హనుమంతరావు, పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ సంఘీభావం తెలిపారు.