Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి ఫగ్గన్ సింగ్కు ఎంపీ, ఎమ్మెల్యే వినతి
నవతెలంగాణ-ఇల్లందు
గతంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని శుక్రవారం కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కు ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియలకు వినతి పత్రం సమర్పించారు. న్యూఢిల్లీలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ఒక లక్షా 30 వేల ఎకరాలలో నిక్షిప్తమై ఉన్న ఐరన్ ఓర్ ముడిసరుకుగా ఉందని వెంటనే పరిశ్రమ ఏర్పాటు దిశగా కృషి చేయాలని అంతేకాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం షెడ్యూల్ 14 లో పొందుపరిచిన అంశాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన భూమి ధర్మారంలో సర్వేనెంబర్ 452 లో 4200 ఎకరాలు ఉన్నాయని, పరిశ్రమను నడిపించుటకు అవసరమైన బొగ్గు కోయగూడెం ఇల్లందు కొత్తగూడెంలో ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పరిశ్రమకు అవసరమైనటువంటి డోలమైట్ కూడా మాదారం లో ఉందని చెప్పారు. పరి శ్రమకు వినియోగించే నీరు కూడా బయ్యారం పెద్ద చెరువు నుండి విరివిగా లభ్యం అవుతుందని రైల్వే రవాణా సౌకర్యం కూడా గుండ్రాతిమడుగు స్టేషన్ లో ఉందని గుర్తు చేశారు. విభజన చట్టంలోని పొందుపరిచిన అంశాలు అవకాశాలను వినియోగించి ఇక్కడ పరిశ్రమ నెలకొల్పితే సుమారు ఐదువేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.