Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
- ఆహ్వానం సంఘం గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్.నాగరాజు
అధ్యక్షులుగా చౌదరి ఎన్నిక
నవతెలంగాణ-కొత్తగూడెం
పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెంలో అక్టోబర్ 3వ వారంలో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ సమావేశాల జయ ప్రధానికి జిల్లాలోని కార్మికులు, కార్మిక శ్రేయోభిలాషులు, వామపక్ష, అభ్యుదయ వాదులు సహకరించి జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్ లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జయప్రదం కోసం పట్టణ ప్రముఖులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సాయిబాబు మాట్లాడారు. దేశం, రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన అనేక ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలయంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు వల్ల జిల్లా ప్రగతి, ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. అటువంటి పరిశ్రమలను నేడు కేంద్ర, ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తుందని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలు ప్రభుత్వ రంగంలో బలపడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ రంగం పరిరక్షణ, రైతుల హక్కులు, వ్యవసాయ రంగం శ్రేయస్సుకోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సిఐటియుని అన్ని వర్గాల వారు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు జరిగింది.
ఆహ్వాన సంఘం ఏర్పాటు
సిఐటియూ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఏ.నాగరాజు, అధ్యక్షులుగా వివేకవర్ధిని విద్యాసంస్థల అధినేత చౌదరి ఎన్నికయ్యారు. వీటితో పాటు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్. నాగేశ్వర రావు, కార్యదర్శి డాక్టర్ అయ్యప్ప రాజశేఖర్, కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగూడెం అధ్యక్షులు కొదుమూరి శ్రీనివాసరావులు చీఫ్ ప్యాట్రన్‌గా ఉన్నారు. వీరితో పాటు సింగరేణి యూనియన్ ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, ఐలూ రాష్ట్ర నాయకులు రమేష్ కుమార్ మక్కడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నేతలు, సిఐటియు నాయకులు, ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు తదితరులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘానికి కార్యదర్శిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్, కోశాధికారిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్ఏ.నభీ, రేపాకుల శ్రీనివాస్, ఏజే.రమేష్, జె.వి, లిక్కి బాలరాజు, గూగులోత్ ధర్మ, వీరభద్రం, సిఐటియు నాయకులు బ్రహ్మచారి, పద్మ, శ్రీధర్, గద్దల శ్రీను, బి.రమేష్, డి.వీరన్న తదితరులు పాల్గొన్నారు.