Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
వానాకాలం సీజన్లో పండిన పెసలు కొనుగోలుకు మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు ఈనెల 10నుంచి 17 వరకు గ్రామాల్లో జరిగే సభలో రైతులు పాల్గొన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 4 వ తేదీ నుంచి గ్రామాల్లో విస్తత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ అరకొరగా వానాకాలం సీజన్లో పండిన పెసలు రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకోలేక సగం ధరకే పెసలు క్వింటాళ్లకు మూడు నుంచి ఐదు వేల రూపాయలకు విక్రయం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయల వెంకటేశ్వరరావు, కట్టా గాంధీ, జిల్లా కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, రావుల రాజాబాబు, సనమ్మతరావు , బిక్కసాని గంగాధర్, తూళ్ళూరి నాగేశ్వరరావు, గుంటుపల్లి వెంకటయ్య, వనమా కృష్ణ, బల్లి వీరయ్య, కొల్లేటి ఉంపేదర్, రమేష్, రవి, మధు, నల్లమోతు మెహన్ రావు తదితరులు పాల్గొన్నారు.