Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు.మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో శుక్రవారం సీపీఎం ఖమ్మం రూరల్ మండల కమిటీ, ఖమ్మం కార్పొరేషన్ మండల కమిటీల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మండల నాయకులు పొన్నెకంటి సంగయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో రమేష్ మాట్లాడుతూ కరోనాను నివారించడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత తొమ్మిది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతులపై కక్ష కట్టడం సిగ్గుచేటన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై గ్రామాల్లో జరిగే నిరసన ర్యాలీలను జయప్రదం చేయాలని కోరారు.సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు తుమ్మల శ్రీనివాసరావు, పి.మోహన్‌రావు, బందెల వెంకయ్య, పుచ్చకాయ నాగేశ్వరరావు, సిలివేరు బాబు, పొన్నం వెంకటరమణ, మేడికొండ నాగేశ్వరరావు, చావా నాగేశ్వరరావు, ఏటుకూరి ప్రసాదరావు, పద్మ, పల్లె శ్రీనివాసరావు, సిద్దినేని కోటయ్య, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు జక్కంపూడి కృష్ణ, తాటి వేంకటేశ్వర్లు, యామిని ఉపేందర్, పెంట్యాల నాగేశ్వరరావు, ఏపూరి వర కుమార్, కుక్కల సైదులు పాల్గొన్నారు.