Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని, ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కృషి విజ్ఞాన కేంద్రంలోని రైతుల ట్రైనింగ్ భవనాన్ని పరిశీలించారు. ట్రైనింగ్ భవనం పూర్తికాకపోవడంతో త్వరితగతిన పూర్తిచేయాలని ఐటిడిఎ డిఈ రాములకు సూచించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల నాయకులు కర్నాటి హనుమంతరావు మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ సాగర్ జలాలతో నింపాలని, నీటి వసతి లేక 28వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంట సాగు చేయలేకపోతున్నారని తెలిపారు. ఇండోర్ స్టేడియంలోకి వెళ్లి అధికారులతో మాట్లాడి ఇండోర్ స్టేడియం పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆర్ అండ్ బి, స్పోర్ట్స్ అథారిటీ స్థలాల్లో షాపింగ్ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న షాపు యజమానులు కలెక్టర్ కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. 50 ఏళ్ల నుండి ఈ రోడ్డు వెంబడి చిరు వ్యాపారం చేసుకుంటున్నామని ప్రత్యామ్నాయంగా షాపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ రాములు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, పదో వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని, కమిషనర్ వెంకటస్వామి, ఎంపీడీవో వెంకటపతి రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.