Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి వాటి పక్కన ఉన్న పంట పొలాలకు తీవ్రనష్టాన్ని కల్గించాయి. చీమలవాడు పెద్దవాగు పొంగి పొర్లుతుం డటంతో చీమలపాడు, బాజుమల్లాయి గూడెం, పాటిమీదిగుంపు, మొట్లగూడెం గ్రామాలకు చెందిన రైతుల పత్తి, మిర్చి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగు వరదతో పొలాల్లో మేటలు వేసి పంట దెబ్బతిన్నంది. పత్తి పూతకు వస్తున్న దశలో వరదలకు నేెలమట్టం అయింది. మిర్చి, వరి కొట్టుకుపోయింది. పాటిమీది గుంపుకు చెందిన గుగులోత్ బాలకృష్ణ అనే రైతుకు చెందిన మూడెకరాల పత్తి, ఎకరం వరి పోలం వరద తాకిడి పంట నేలమట్టం అయి మట్టిలో కూరకపోయింది. వేలాది రూపాయల ఖర్చుతో వేసిన పంటలు వరదల తాకిడికి నష్టం పోవటం ఆ రైతు దిగాలు పడి కన్నీరు పెట్టాడు.
పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటల ధ్వంసం అయ్యాయన్నారు. అధికారులు వెంటనే పరిశీలించి పంటనష్టాన్ని అంచనా లేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు.