Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తిరుమలాయపాలెం
మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బోడ మంగీలాల్ అధ్యక్షతన శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. గ్రామాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని పరిష్కరించటానికి నిధులు లేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో మద్యం షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని,యువత మద్యానికి అలవాటు తప్పుదారి పడుతున్నారని తెలిపారు. గ్రామాలలో ఏఎన్ఎంలు స్థిరనివాసం ఉండకపోవటం వలన వైద్యం సకాలంలో అందటం లేదని తెలిపారు. చేపల చెరువుల విషయంలో గ్రామస్తులకు, మత్స్యకారులకు గొడవలు అవుతున్నాయని అన్నారు.సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాలలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఎంపీపీ మంగీలాల్ మాట్లాడుతూ ఇక నుంచి అన్ని శాఖల అధికారులు గ్రామాలలో పర్యవేక్షణ జరపాలని, సర్పంచులకు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో నెలకొని ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కార దిశగా రూపకల్పన చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో జయరామ్, జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు బుద్ధ వంశీకృష్ణ, ఏపీఓ నరసింహారావు, ఎస్ఐ పి.రఘు, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.