Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులు పోనిశెట్టి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో అన్ని సమస్యలు తీర్చామని గొప్పలు టీవీల్లో, పేపర్లలో తప్పా కార్యరూపంలో లేదని బీజేపీ నాయకులు పోనిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని 5 వార్డులో గల గాంధీనగర్లోని బానోత్ దేవి, వల్లెపు ఎల్లమ్మల ఇల్లులు మురుగు నీటితో నిండి పోవడంతో పాల్వంచ బీజేపీ నాయకులు అట్టి ఇండ్లను సందర్శించారు. అనంతరం బీజేపీ నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాల్వంచ నడి బొడ్డున ఉన్న గాంధీ నగర్లో గత నలభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న స్థానికులకు కనీసం డ్రైన్ రోడ్డు సదుపాయం లేక పోవడంతోనే అర్ధమౌతుంది ఈ ప్రభుత్వ అభివృద్ధి అని అన్నారు. పాల్వంచ మార్కెట్ ఏరియా, రాంనగర్ లనుండి పెద్ద ఎత్తున వచ్చే డ్రయినేజి వాటర్ మొత్తం కాలువ లేకపోవడంతో ఈ రెండు ఇళ్ల చుట్టు అడుగుపైన మురికి నీళ్లు పేరుకపోవడంతో వారు తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, కలెక్టర్ స్థానిక శాసన సభ్యులు చొరువ తీసుకొని ఈ ప్రాంతంలో కాలువ రోడ్డు నిర్మించి వీళ్ళ సమస్య పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో గంధం ప్రసాద్ ,బొమ్మినేని క్రాంతి ,బాలాజీ నాయక్, మాదారపు లక్ష్మణ్, నిరంజన్, ఉపేందర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.