Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్జిటీలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా మండలంలోని అచ్యుతాపురం ఎంపిపి పాఠశాలలో ఎస్జిటీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఏజె ప్రభాకర్‌ను రాష్ట్ర ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను 48 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో ఎస్జిటిలు 11 మంది ఉండగా ఏజే ప్రభాకర్‌ను మూడో స్థానంలో ఎంపిక చేశారు. ఏజే ప్రభాకర్ ఎస్జిటీ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడంతో పాటు, తాను పనిచేస్తున్న పాఠశాల అభివద్ధి, హరితహారం, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పలు సేవా కార్యక్రమాలు, తూరుబాక గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా ఆయన అందించిన సేవలకు ప్రతి ఫలంగా రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో ఎంపికయ్యాడు. కాగా ఈనెల 5వ తేదీన హైదరాబా దులోని రవీంద్రభారతిలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన ఉన్నతాధికారులు చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకోనున్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఏ. జె. ప్రభాకర్ ను మండల విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది ఆయనను అభినందించారు.