Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
యువతీ యువకులకు ఉపాధి ఆసరాగా నిలిచే కంప్యూటర్ కోర్సులను మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామంలో నిర్వాహకులు గంటా శ్రీనివాస్ ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ముదిగొండ ఎస్ఐ తాండ్రనరేష్ పిఎస్ఐఎం సురేష్, నేలకొండపల్లి ఏఎంసి డైరెక్టర్ బంక మల్లయ్య, గ్రామ ఉప సర్పంచ్ గంటా పద్మావతితో కలిసి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్సై తాండ్ర నరేష్ మాట్లాడుతూ కోర్సును యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు కందుల రంగారావు, కట్ల సురేష్, వెంకటాపురం యూత్ లీడర్స్ బంక శ్రీకాంత్, తోటమల్ల ఉదయరాజు, నాగరాజు, బంక వినరు, షేక్ మదర్ సాహెబ్, పి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.