Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- బోనకల్
మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో తలసేమియా బాధితుల కోసం యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని బోనకల్ ఎస్ఐ బి కొండలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 24 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు బోయనపల్లి పవన్ కుమార్, దుడ్డు విజరు కుమార్, వజ్రాల వెంకట నవీన్, బాలు సాయి, బాలు జశ్వంత్, బోయనపల్లి వరుణ్ తేజ లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఖమ్మంకు చెందిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో నిర్వహించారు. రక్తదానం చేసిన వారిలో బోనకల్ ఎస్.ఐ కొండలరావు, సర్పంచి యర్రంశెట్టి సుబ్బారావు, సి.పి.ఎం నాయకులు కిలారు సురేష్, పల్లెప్రపంచం సర్వీసెస్ కోశాధికారి కొండేటి అప్పారావు, సభ్యురాలు పొన్నం ఆమనిలతో పాటు గ్రామ యువకులు ఉన్నారు. రక్తదానం చేసినవారికి గ్రామ సిపిఎం నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, సిపిఎం మండల నాయకులు కిలారు సురేష్ పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పల్లెప్రపంచం సర్వీసెస్ అధ్యక్షులు పల్లా కొండలరావు, ఎం.పి.టి.సి కోటపర్తి హైమావతి, సిపిఎం నాయకులు చలమల అజరు కుమార్, బోయనపల్లి పున్నయ్య, చలమల హరికిషన్ రావు, టీఆర్ఎస్ నాయకులు కొణకంచి నాగరాజు, సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవి తదితరులు పాల్గొన్నారు.