Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామాలయంలో ప్రత్యేక పూజలు
నవతెలంగాణ-భద్రాచలం
సమాజంలో మానవ నడతకు మార్గదర్శిగా, అందరికీ ఆదర్శ ప్రాయుడు శ్రీ రాముడు నిలిచారని శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానాచార్యులు కేఈ స్థలశాయిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించేందుకు ఆయన వెళ్లగా దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో శ్రావణ్ కుమార్, వేద పండితులు గుదిమెళ్ల మురళీకష్ణమాచార్యులు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
ఆయన వెంట అహౌబిల రామానుజ జీయర్ స్వామి ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో వికాస తరంగిణి, జీయర్ మఠం, జీయర్ ట్రస్టుకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.