Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
వంద పడకల ఆస్పత్రిలో వైద్యులను నియమించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని ఆఖిల పక్ష పార్టీల నాయకులు తెలిపారు. శుక్రవారం స్థానిక సింగరేణి ఇల్లెందు వసతి గృహంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మిషనర్ వాకాటి కరణ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, భద్రాచలం ఐటిడిఏ పివో గౌతమ్ పోట్రాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనర్ వాకాడి కరుణ మణుగూరులో వంద పడకల ఆసుపత్రి వున్నదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నీ సౌకర్యాలు వున్నాయని, వైద్యులను నియమించాలని ఆఖిల పక్ష పార్టీల నాయకులు ఆమెకు తెలిపారు. దానిని ఆమె సానుకూలంగా స్పందించారు. ఐటిడిఏ పివో గౌతమ్ పోట్రా నెలలోపు అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, జెడ్పిటిసి పోశం నర్సింహారావు లు ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదని,వైద్య విధాన పరిషత్, వైద్య విద్యాశాఖ పరిధిలో మణుగూరు వంద పడకల ఆసుపత్రి పైల్ లేని కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. ఈ సంఘటనకు ఏవరు బాధ్యులు కారని పెద్దన్న పాత్ర పోషించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు, ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతిపక్షాలపై దుస్పాచారం చేయడం సరికాదని అన్నారు. నేడు జరగబోయే నియోజకవర్గ బంద్ జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆఖిల పక్ష నాయకులు బి. అయోధ్యచారి, మధుసూదన్‌రెడ్డి, పుల్లారెడ్డి, చలపతిరావు, నర్సింహారావు, శివప్రశాంత్, గౌష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.