Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇబ్బందులు పడుతున్న వార్డు ప్రజలు
అ బీఎస్పీ అధ్యక్షులు కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ప్రజాప్రతినిధి, ఆమె బంధువు చేసిన పనులకు వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో పర్యటించారు. వర్షాకాలంలో పట్టుమని 5 నిమిషాలు వర్షం కురిస్తే ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయని తెలిపారు. మురుగు, డ్రైనేజీ నీరు ఇండ్లల్లోకి చేరి ఇబ్బందులు కామేష్ దృష్టికి తీసుకువచ్చారు. వార్డు ప్రజలు వెళ్లి స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సమస్యను వివరించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే మున్సిపల్, జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, గంధం మల్లికార్జున్ రావు, నిరంజన్ కుమార్, రాజేందర్, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.