Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని గోల్యా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలో ఈనెల ఆగస్టు 19న విద్యుద్ఘాతంతో గాయాలైన భూక్య రమ్యకు దాతలు ఆపన్న హస్తం అందించాలని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోలియాతండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బేతస్థ చర్చ్ ఎదురుగ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్‌పైన జరిగిన 33/11 కె.వి విద్యుత్ ప్రమాదంలో అంగవైకల్యం అయి, శరీర భాగాలూ కాలి పోయి గాయాలపాలు అయినా విషయం తెలిసిందే. కానీ పాప శరీర భాగాలు రోజురోజుకు ఇన్ఫెక్షన్తో పాడై ఆ చర్మాన్ని, కాండరాన్ని తీసివేయడం హైదరాబాద్ ఉస్మానియా వైద్యశాలలో చికిత్స జరుగుతుందన్నారు. ఆ వైద్యంతో బాగు అయి తొందరగా ఇంటికి వస్తదేమో అని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఫలితం మాత్రం కనిపించడం లేదంటున్నారు. మెరుగైన చికిత్స కోసం మరొక వైద్యశాలకు తీసుకెళ్లాలంటే ఆర్థిక స్తోమత లేదని బాధపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి లెవెన్ కె.వి ఏర్పాటుచేసిన జెన్కో సంస్థ నుండి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు