Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైద్యులను నియమించేంత వరకు
పోరాటం కొనసాగిస్తాం...
అ నాటకీయ రాజకీయాలను అధికారపార్టీ
మానుకోవాలి : ఆఖిల పక్షాలు
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో మణుగూరు కేంద్రంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది నియమించి ప్రజలను ప్రాణాలు కాపాడాలని ఆఖిల పక్ష పార్టీల దశల వారి ఆందోళనలో భాగంగా మణుగూరు బంద్ విజయవంతమైంది. పట్టణంలోని అన్నీ రకాల వ్యాపారస్తులు స్వచ్ఛంధంగా బంద్ నిర్వహించారు. అనంతరం ఆఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంద పడకల ఆసుపత్రిని సందర్శించి నాయకులు మాట్లాడుతూ.... ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆఖిల పక్ష పార్టీల నాయకులు దశల వారి ఆందోళనలను అధికార పార్టీ నాయకులు హవహేళన చేయడం సరైంది కాదన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి, నాయకులు ఈనెల 9న వైద్యులను నియమిస్తున్నట్టు హాడావిడిగా ప్రకటించి వైద్యులను నియమించినట్టు తెలియజేశారని, కానీ వంద పడకల ఆసుపత్రిలో 30 మంది డాక్టర్లు కలిసి మొత్తం వంద మంది సిబ్బంది అవసరం వుంటుందన్నారు. దీనికి విరుద్ధంగా ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి అధికార పార్టీ నాయకలు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. వెంటనే వైద్య సిబ్బందిని నియమించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆఖిలపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.అయోధ్యచారి, నెల్లూరి నాగేశ్వరరావు, మధుసూదన్‌రెడ్డి, నవీన్, చలపతిరావు, రమేష్, నర్సింహారావు, టివిఎంవి.ప్రసాద్, లక్ష్మణ్‌రావు, ఈశ్వర్రావు, నర్సింహారావు, రవి, వంశీ, ముత్యాలు, దుర్గ్యాల సుధాకర్, సర్వార్, సరెడ్డిపుల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
కరకగూడెం : మండల కేంద్రంలో శనివారం మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్స్, వైద్య సిబ్బందిని వెంటనే నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మండల అఖిలపక్ష పార్టీల నాయకులు నిర్వహించిన బంద్ విజయవంతం. ఈ కార్యక్రమంలో వామపక్షా, ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు రుక్మారావు, ప్రధాన కార్యదర్శి చందర్రావు, చందా రత్తమ్మ, కృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి సతీష్, సీపీఐ(ఎం) నాయకులు సమ్మయ్య, వెంకన్న, టీడీపీ మండల నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : మణుగూరు మండలంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిలో వైద్యులను నియమించి, వైద్య పరికరాలను సమకూర్చాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రోడ్లపై ర్యాలీ చేసి, బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామనాథం, బీజేపీ అధ్యక్షుడు శివ ప్రసాద్, సీపీఐ(ఎం) వెంకన్న, సీపీఐ మనోహర్ చారి, టీడీపీ తోట, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండలంలో కాంగ్రెస్ మిత్ర పక్షాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. మణుగూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వైద్యులను నియమించాలని మిత్రపక్షాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మిత్రపక్షాల నాయకులు గాదే కేశవ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, సురేష్, ప్రకాశరావు, ప్రభాకర్ రెడ్డి,ఉపేందర్, మల్లెల మడుగు ఎంపీటీసీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.