Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పేపర్ బారుకి సన్మానం
నవతెలంగాణ-పినపాక
విశ్వవ్యాప్త వార్తలను వాకిట ముందుకు చేర్చే సారధి, తొలి కిరణానికే పలకిరింపు పేపర్ బారు అని పినపాక ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రసంగించారు. ప్రపంచ పేపర్ బారు దినోత్సవం సందర్బంగా పేపర్ బారు కిరణ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్ట్ శంకర్, నాగేందర్, భరత్‌లు మాట్లాడుతూ పేపర్ బారు సమస్త విశ్వ సమాచారాన్ని మన ముందుకు, ఉషోదయ కిరణాలు చేరక మునుపే ప్రతి గడపను పలకరిస్తాడన్నారు. ఉరుములు, మెరుపులు తరుముతున్నా, కుండపోత వర్షం కురిసినా, వేకువ చలి ఎముకులు కొరికేస్తున్నా పరుగు ఆపడు. అతడు రానిదే పొద్దుపొడిచినట్టుండదన్నారు. అతడు లేనిదే ఏ ఇంటికీ సమాచారం చేరదని, వేడి వేడి వార్తలు వాకిట ముందుకు చేర్చడం అతడికి సాధ్యం అని పొగిడారు. లింగారెడ్డి, మహేష్, సారయ్య, సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సంపత్ , విజరు, సందీప్ రెడ్డి పాల్గొన్నారు.