Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
తమ పార్టీ కార్యకర్తలను అకారణంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించడం సరైంది కాదని వైస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కో - ఆర్డినేటర్ తుంపాల కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలమ్మ ఆదేశానుసారంగా రాజన్న యాదిలో జెండా పండుగ లో భాగంగా రఘునాథపాలెం మండలం ముప్పైఒక్క గ్రామాల్లో జెండాను ఆవిష్కరణకు బయలుదేరుతున్న సందర్భంగా కోయిల చిలక గ్రామం శివారులో మంత్రి పువ్వాడ అజరు కుమార్ అండదండలతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించడం సరైంది కాదని , ప్రజాస్వామ్య హక్కులకు , భారత రాజ్యాంగానికి భంగం కలిగిస్తున్న మంత్రి అజరు కుమార్ పై ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలని కోరారు . టీఆర్ఎస్ పార్టీ కి ధీటుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ గట్టి పోటినిస్తూ పనిచేస్తుందని , నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడి ప్రజల ఆదరణ పొందుతుందని భయంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీలను , దిమ్మలను , హౌర్డింగ్లును మంత్రి అజరు తన అనుచరులతో మరియు కార్యకర్తలతో ధ్వంసం చేయించి అగౌరవ పరచడం భావ్యం కాదని , రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేరని హెచ్చరించారు. శాంతియుతంగా ప్రజల ఆదరణతో ఇప్పటి వరకు సుమారుగా 40 పార్టీ జెండాను ఎగరవేశారని తెలిపారు . ఈ విలేకరుల సమావేశంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుమ్ము అప్పిరెడ్డి , ఆలస్యం సుధాకర్ , మర్రి శ్రీను ,రాష్ట్ర యువజన నాయకులు మణిగి లాలయ్య , గాజుల వరుణ్ కుమార్ , గుండ్ఱెపూనేని ఉదరు , పసుపులేటి సైదులు తదితరులు పాల్గొన్నారు .