Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల కేంద్రమైన ముదిగొండ ప్రధాన రహదారి (ఆర్ అండ్ బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీపములో ఖమ్మం- కోదాడ ప్రధానరహదారి అధ్వానంగా మారి గుంతలమయంగా ఉండటంతో పాదచారులు వాహనదారులు ప్రయాణికుల రాకపోకలకు ఈ రహదారి పలు ఇక్కట్లకు గురిచేస్తుంది ఆర్అండ్బీ అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిని వర్షపు నీళ్లకు కోతకు గురై ధ్వంసమైనది ఈరహదారి వల్ల వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది వర్షపు నీరు రోడ్డుమీద ఆగి రోడ్డు గుంతల మయంగా మారటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు కాగా ముదిగొండ ప్రధాన సెంటర్ అయిన ఆటో స్టాండ్ సమీపాన వర్షం వస్తే నీరు ఆగి చిన్నపాటి వాగుల తలపిస్తుంది వర్షపు నీరు పోయే మార్గం లేక రోడ్డు మీద అలానే నీళ్లు ఉండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వాహనాలు వెళ్లేందుకు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు దీంతో పారిశుద్ధ్యం పెరిగి వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రోడ్డుపై అధిక లోడుతో వెళ్తున్న వాహనాలుతోపాటు ప్రయాణికుల రాకపోకలు రద్దీ పెరిగింది దీంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి ఈరోడ్డు మార్గాన అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఎంతోమంది చూసుకుంటా వెళుతున్నారు తప్ప రోడ్డును మరమ్మతులు చేయించే ప్రయత్నం చేయటం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్అండ్బీ అధికారులు మాత్రం ఈరోడ్లు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ముదిగొండ ప్రధాన రహదారి నుండి ఖమ్మం వెళ్లే మార్గంలో పారిశ్రామిక ప్రాంతంలో వర్షపునీరుతోపాటు గ్రానైట్ లోనే వ్యర్థపు నీరు రోడ్డు మీదికి రావడం వలన రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు గ్రానైట్ లోనే వ్యర్థపు నీరు రోడ్డు మీదకు రాకుండా చేయాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు బహిరంగం గానే చర్చించుకుంటున్నారు. మరోపక్క అధిక లోడుతో వెళుతున్న వాహనాలకు సంబంధిత శాఖ అధికారులు జరిమానా విధించే చర్యలు తీసుకుంటే రోడ్లు ధ్వంసం కాకుండా ఉంటాయని స్థానికులు అంటున్నారు. ఇప్ప టికైనా సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆర్అండ్బి రహదారికి మరమ్మత్తులు చేయించాలని వాహనదారులు ప్రయాణికులు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.