Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని వర్తకసంఘంలో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్ హాజరయ్యారు. సమావేశంలో సుడా చైర్మన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పేరు కోసం కాకుండా భక్తితో నిర్వహించాలన్నారు. ప్రతి సంవత్సరం స్తంభాద్రి ఉత్సవ సమితి వారి సభ్యత్వం పొందిన వారి విద్యుత్ వినియోగ చార్జీలను మరియు మైక్ పర్మిషన్ ఛార్జీలను పువ్వాడ ఫౌండేషన్ ద్వారా చెల్లించబడు తుందన్నారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ ద్వారా మీకు కావాల్సిన సదుపాయాలను మేయర్ పరిశీలించి తక్షణమే స్పందిస్తారన్నారు. మండపాల వద్ద భక్తి పాటలు మాత్రమే పెట్టాలన్నారు. మండపాల వద్ద వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు శుభ్ర పరిచే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం పట్టణ ట్రాఫిక్ ఏ.సి.పి.రామోజీ రమేష్, మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వయ్య, ట్రాఫిక్ సీఐ అంజలి, కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్, కన్వీనర్ కన్నం ప్రసన్నకృష్ణ, కార్య నిర్వహణ అధ్యక్షులు గంటల విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కీసారా జైపాల్ రెడ్డి, డౌలె సాయి కిరణ్, శ్రీ హరి, అల్లిక అంజయ్య, రుద్రప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.