Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రగిరి ప్రదక్షణ
అ ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి, అహౌబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాద జీయర్ స్వామిలు శనివారం దర్శించారు. ఈ సందర్భం గా వారికి దేవస్థానం అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వారు నిర్వహించారు. మాతృశ్రీ పవనంలో భాగంగా చినజీయర్ స్వామి రామాల యాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వైకుంఠ రామ సేవా యాత్రగా భద్రగిరి ప్రదక్షణ సైతం నిర్వహిం చారు. ముందుగా కోలాట బృందాలు వెళ్తుండగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో భద్రగిరి ప్రదక్షణ నిర్వహించారు. ఇదిలా ఉండగా వికాస తరంగిణి, జీయర్ మఠం సభ్యులతో చినజీయర్ స్వామి ఆత్మీయ సమావేశంలో సేవా సందేశాన్ని అందజేశారు.
ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆస్థాన పారాయణదారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు రచించిన శ్రీ భాగవత నామ ఘోశం, భారతంలో హితలు అనే రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను చినజీయర్ స్వామి, అహౌబిల రామానుజ జీయర్ స్వామి భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ఎన్డీజీ అంతర్వేది కృష్ణమాచార్యులను పుస్తకంలోని అంశాల గురించి అడిగి తెలుసుకొని ఆయనను చినజీయర్ స్వామి అభినందించారు.