Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రక్షణ చర్యలు చేపట్టాం : మున్సిపల్ చైర్మన్
నవతెలంగాణ-ఇల్లందు
గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇల్లందు పాడు చెరువు, బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. ఇల్లందు పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ సురక్షి తంగా ఉన్నాయి. భారీ వర్షాల వల్ల పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్పెషల్ రెస్క్యూ టీంను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మెన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తు పర్యవేక్షిస్తు న్నారు. వారు మాట్లాడుతూ ఇల్లందు పాడు చెరువు మునుపెన్నడు రాని విధంగా చెరువు ఉప్పొంగుతున్నప్పటికీ ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనల మేరకు ముందుచూపుతో ఆరు నెలల క్రితమే అలుగు ప్రాంతంనుండి బుగ్గవాగు వరకు పూడిక తీసి వెడల్పు చేసినం కాబట్టే నేడు ఇంతటి భారీ వర్షాలు కూడా ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది కలగకుండా సురక్షితంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1, 2వ వార్డు కౌన్సిలర్లు రవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.