Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
చత్తీస్ఘడ్ రాష్ట్రం ఉసురు బ్లాకు రాంపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు మిలిషియా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం భద్రాచలంలో ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు కదలికలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, 141 బెటాలియన్ సీఆర్పీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచలం డివిజన్లోని చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహిస్తుండగా ఈ మిలిషియా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు ఏయస్పీ తెలిపారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన కుంజం ఆడమ, మాడివి జోగా, మాడవి బండి, మాడవి ఉంగా, మడకం సన్నులతో పాటు 17 యేండ్ల బాలుడుని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. వీరందరూ గత రెండు మూడేండ్ల నుండి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా పూసు గుప్ప అటవీ ప్రాంతంలో గత ఏడాది ఆగస్టు నెలలో దాదాపు 100 గుంటలు తీసి అందులో ఇనుప చువ్వలు గల చెక్కలను అమర్చారని ఆయన పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు సభ్యులలో 17 సంవత్సరాల బాలుడని గుర్తిం చామని, మిగిలిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసి జుడిష ియల్ రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. కాగా మైనర్ బాలుని కోర్టు ఆదేశాల మేర కు జ్యువెనల్ హాల్‌కు తరలించినట్టు ఏఎస్పీ పేర్కొన్నారు.