Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-ముదిగొండ
మండల కేంద్రమైన ముదిగొండ ప్రధానరహదారి (ఆర్ అండ్ బి) ఖమ్మం- కోదాడ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ధ్వంసమై పోయిందని, దీనికి వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం రహదారి ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో వైస్ ఎంపీపీ మంకెన దామోదర్ మాట్లాడుతూ ముదిగొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీలు నిర్మాణం చేసి మురికి నీరు వర్షపు నీరును నిల్వ లేకుండా చేయాలన్నారు. నిల్వ ఉన్న నీటితో ప్రజలకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి పి సంపత్ కు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బట్ట పురుషోత్తం, మర్లపాటి వెంకటేశ్వరరావు, మందరపు వెంకన్న, కోటేశ్వరరావు, ఐద్వా మండల అధ్యక్షులు మందరపు పద్మ, మాజీ ఎంపీటీసీ మర్లపాటి అనిత, ముదిగొండ సిపిఎం గ్రామశాఖ1, 2వ కార్యదర్శులు బట్టు రాజు, ఇరుకు నాగేశ్వరరావు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మెట్టెల సతీష్, ఎస్ఎంఎస్ చైర్మన్ సూరపల్లి నాగరాజు, నరేష్ పాల్గొన్నారు.