Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోడు సాగు రైతుల పట్ల అధికారుల
వైఖరి మార్చుకోవాలి
అ సీతమ్మ సాగర్ భూ నిర్వాసితులకు
మెరుగైన ప్యాకేజీ అందజేయాలి
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
విష జ్వరాలతో గిరిజన పల్లె ప్రజానీకం మంచమెక్కారని, వెంటనే ఏజన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీతానగరం, పెద్దబండిరేవు పార్టీ శాఖా మహాసభల జెండా ఆవిష్కరణ కార్యక్రమాని ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పెద్దబండిరేవు గ్రామంలో నాగుల పార్వతి, సోయం వీర్రాజు అధ్యక్షతన జరిగిన మహా సభలో ఆయన మాట్లాడారు. ఏజన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ అధికంగా నమోదు కావడంతో పాటు ప్రజలు పిట్టాల్లా రాలి పోతున్నా హెల్త్ క్యాంపులు నిర్వహించకుండా ఏజన్సీ వైద్యాన్ని నిర్లక్షం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. గిరిజనులు పోడు భూములనే నమ్ముకుని వాటినే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని సాగు భూముల పైన కన్నేసిన అధికారులు, అటవీ శాఖ అధికారులు హరిత హారం, మెగా పార్కుల పేరుతో గిరిజనుల వాటి నుండి వెళ్ల గొట్టే కుట్ర చేస్తుందన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీతమ్మ ప్రాజెక్టు పేరుతో విలువైన భూములకు రూ.8 లక్ష్యల ఇస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.25 లక్షల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే విధంగా పార్టీ శ్రేణులు బలమైన ఉద్యమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మహా సభలో పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, పర్ణశాల ఉపసర్పంచ్ వాగె ఖాదర్బాబు, నాయకులు సోయం కనకరావు, పాయం హరిబాబు, కొమరం రత్నకుమారి, సోయం సుశీల, రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.