Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని పర్ణశాల రామాలయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడి దగ్గర దొరికిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా కేంద్రం కొత్తవాడకు చెందిన రామా రాజ్‌కుమార్ (38) గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ వరంగల్ ఎంజిఎమ్లో వైద్యం పొదుతున్నాడు. కాగా మృతుడి భార్య ఇటీవలే మృతి చెందినట్టు సమాచారం. ఆనారోగ్య సమస్యలతో పాటు పాటు మనస్తాపంతో శనివారం మధ్యాహ్న సమయంలో పర్ణశాల వచ్చి ఓ గద్దె మీద సేద తీరుతూ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంగటనా స్థలానికి చేరుకుని అతని జేబులో ఉన్న కార్డులు, ఫోన్ ఆధారంగా మృతుడి అన్నయ్య రామా రాములుకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పర్ణశాల చేరుకుని మృతి చెందిన రాజ్ కుమార్‌ను స్వగ్రామం తీసుకు వెళ్లారు.