Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేసీఆర్‌తోనే నా రాజకీయ ప్రస్థానం
అ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ నేలకొండపల్లి
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే కలిసి ప్రయాణం చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని చెన్నారం శుద్ధపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో తాను నీతి నిబద్ధతకు కట్టుబడి ఉన్నానని, తాను నమ్మిన పార్టీ కోసం, నమ్ముకున్న కార్యకర్తల కోసం చివరికంటూ పని చేయడమే తన లక్ష్యమన్నారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సహకరించారని గుర్తు చేశారు. తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీతిగా నిబద్ధత ఉన్నానని ముఖ్యమంత్రి సారథ్యంలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని అన్నారు. ఢిల్లీలో గత కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నా నన్నారు. ఖమ్మం జిల్లాను 44 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, జిల్లాలోని భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో రైతులకు ప్రతియేటా రెండు పంటలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాన న్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో రెండు జిల్లాలకు ఉజ్వల భవిష్యత్తును అందించే పనులు కొనసాగుతున్నా యన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం సుద్దేపల్లి ఏటిపై తన హయాంలో నిర్మించిన బ్రిడ్జిని ఆయన సందర్శించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ రవి, తమ్మినేని కష్ణయ్య, శాఖమూరి రమేష్, వెన్నుపూసల సీతారాములు, నెల్లూరి భద్రయ్య, షేక్ మస్తాన్, మంకెన వెంకటేశ్వరరావు, కడియాల శ్రీనివాస్‌రావు, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.