Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అ ఆయన సేవలు చిరస్మరణీయం : సండ్ర మహాలక్ష్మి
నవతెలంగాణ-సత్తుపల్లి
నేటి సమాజంలో మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఆర్థిక పరమవుతున్న నేపథ్యంలో తన నిర్వహణలో ఉమ్మడి కుటుంబ సభ్యులను ఉన్నత స్థితికి తీసుకురావడానికి కారకుడైన కొత్తూరు జ్వాలేశ్వరరావు ఉమ్మడి కుటుంబాలకు మార్గదర్శి అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో జరిగిన జ్వాలేశ్వరరావు ప్రథమ వర్దంతి సభలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన చిత్ర పటానికి పూలుజల్లి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సతీమణి మహాలక్ష్మి మాట్లాడుతూ జ్వాలేశ్వరరావు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ మాట్లాడుతూ కోదండ రామాలయం, వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా, కళాభారతి, సుభాశ్ యువజన సంఘం బాధ్యునిగా అందించిన సేవలు పట్టణ ప్రజలు మరువలేరన్నారు. మమత మెడికల్ కళాశాల డైరెక్టర్ కొత్తూరు ప్రభాకరరావు మాట్లాడుతూ తన అన్న కుటుంబాన్ని తీర్చిదిద్దిన మహనీయుడన్నారు. స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో పట్టణ ప్రముఖులు దారా కృష్ణారావు, ఉడతనేని అప్పారావు, పీఎల్ ప్రసాద్, సోమరాజు శివరామప్రసాద్, చల్లగుళ్ల నరసింహారావు, మల్లూరు అంకమరాజు, వనమా వాసుదేవరావు, కందిమళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.