Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే మాటలను కొందరు వక్రీకరిస్తున్నారు
అ ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్
లావుడ్యా జీవన్‌లాల్
నవతెలంగాణ-కారేపల్లి
ప్రజల సాధక బాధకాలు క్షేత్రసాయిలో మీకు తెలుస్తాయి, సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యే పాటిస్తారంటూ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ తనయుడు ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమిషనర్ లావుడ్యా జీవన్‌లాల్ విలేకరులను కోరారు. ఆదివారం తొడితలగూడెంలో ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్ ఇంట్లో జరిగిన వేడుకలో పాల్గొన్న జీవన్‌లాల్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ త్యాగాన్ని కొనియాడుతూ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు థ్యాంక్స్ చెప్పితే తప్పేంటన్నారు. కొందరు కావాలని ఎమ్మెల్యే మాటలను ఒకరిద్దరు వక్రీకరిస్తున్నారని అన్నారు. గొడవలకు రాములునాయక్, జీవన్‌లాల్ దూరం, మచ్చలేకుండా ఉండాలనుకుంటున్నామంటూ వ్యాఖ్యాని ంచారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేసే నాయకుడు ఎమ్మెల్యే రాములునాయక్ అని కొనియాడారు.
వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులు
తొడితలగూడెంల ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్ లో ఇంట్లో జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధుల హాజరైనారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ), వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోషయ్య, కారేపల్లి జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, సోసైటీ ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, సర్పంచ్‌లు మాలోత్ కిషోర్, బానోత్ కుమార్, మొగిలి ఆదినారాయణ, ఆదెర్ల స్రవంతి, మాలోత్ రాంజీ, బానోత్ సక్రాం, ఎంపీటీసీలు దారావత్ పాండ్యానాయక్, మూడు జ్యోతిమోహన్, బానోత్ రమేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, సొసైటీ డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోషయ్య పాల్గొన్నారు.
గురు పూజోత్సవంలో మున్సిపల్ చైర్మన్‌కు సన్మానం
గురు పూజోత్సవం సందర్బంగా ఆదివారం కారేపల్లి మండలం తొడితలగూడెంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు(డీవీ)ని సన్మానించారు. ఇల్లందు విద్యాసంస్ధల అధినేత అయిన దమ్మాలపాటి వెంకటేశ్వర్లును ఇన్‌కంట్యాక్స్ అడిషనల్ కమీషనర్ లావుడ్యా జీవన్‌లాల్ సమక్షంలో పూర్వ విద్యార్ధులు శాలువ కప్పి సన్మానం చేశారు.