Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు
అ 6న నిరసన కార్యక్రమాలు
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జాతీయ మానిటైజేషన్ ప్లాన్ కోసం జాతీయ ఆస్తులను విక్రయిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కార్యదర్శులు, మండల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులపై దాడి దేశ భవిష్యత్‌పై దాడిగా పరిగణిస్తుందని తెలిపారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, విద్యుత్, బొగ్గు గనులు, మైనింగ్, టెలికాం, రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, స్టేడియాలు, గ్యాస్ పైప్లైన్ల సంస్థలను నిర్వహించలేని చేతకాని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అధికారంలో కొనసాగాలని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ తన వ్యాపార మిత్రులలో కొంతమందికి ప్రయోజనం చేకూర్చేందుకే భారతదేశాన్ని క్లియరెన్స్ సేల్‌లో పెట్టాడని, అందులో భాగంగా రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తరచూ వంట గ్యాస్, ఇంధనధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం కేంద్ర కమిటి పిలుపు మేరకు సెప్టెంబర్ 6న (సోమవారం) దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలన్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి కెసిఆర్ జవాబుదారీతనం లేని పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తనకు అవసరమైనపుడు ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించటం, కేవలం కొంతమందికే అమలు చేసి ప్రచారం చేసుకోవటం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అలవాటైందని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ లొసుగులు, తగినన్ని డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించకపోవడం, విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, జిల్లా కమిటి సభ్యులు మాదినేని రమేష్, నందిపాటి మనోహర్, బండి పద్మ, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.