Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, రాష్ట్ర సలహాదారు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-వైరా టౌన్
యాదవులు, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమగ్ర అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమవుతుందని గొర్రెలు, మేకలు పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, జియంపిఎస్ రాష్ట్ర సలహాదారు కాసాని ఐలయ్య అన్నారు. ఆదివారం వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా 8వ మహాసభ జియంపిఎస్ జిల్లా అధ్యక్షులు బారి మల్సూర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉడుత రవీందర్, కాసాని ఐలయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుందని, నాటి నుండి నేటి వరకు అభివృద్ధి, ఐక్యత నినాదంతో పోరాడి అనేక పథకాలు, జీవోలను సాధించడమే కాకుండా వాటి అమలు కోసం నేటి వరకు పోరాడుతూనే ఉందని వారు అన్నారు. అలాగే మొదటి, రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలని చేయాలని, 18 సంవత్సరాలు నిండిన కురుమ, యాదవుల యువకులందరినీ కొత్తగా సొసైటీలలో చేర్చి వారికి గొర్రెలు, మేకలు అందజేయాలని, గొర్రెలు, మేకల పెంపకం దారులకు ఒక్కొక్కరికి యూనిట్ ధర ప్రకారం రూ.1,75,000 దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటులో జమ చేయాలని అన్నారు. ప్రమాద బీమా 6లక్షల హామీని అమలు చేసి ప్రతి ఒక్కరికి వర్తింపజేయాలని అన్నారు. కురుమ, యాదవుల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ పథకం అమలు చేసి 5 లక్షల నుండి 10 కోట్లు వరకు వడ్డీలేని రుణాలు అర్హత, ఆసక్తి ఉన్న వారందరికీ ఇవ్వాలని అన్నారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషనులలో నివసించే కురుమ, యాదవుల పాడి గేదెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ గేదెలు ఇవ్వాలని ముఖ్య అతిధిగా హాజరైన వైరా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ జేడి వేణు మనోహర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల, మేకల సంఘం జిల్లా కార్యదర్శి మేకల నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు గుమ్మా నరసింహారావు, మేళ్ళచెరువు కోటేశ్వరరావు, హైకోర్ట్ అడ్వకేట్ వెంకట్ యాదవ్, ప్రముఖ న్యాయవాది మేకల సుగుణరావు, వాకదాని కొండలరావు, అల్లిక నరసయ్య యాదవ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మావిళ్ళ వెంకటేశ్వర్లు, ధోంతేబోయిన నాగేశ్వరరావు, కంపసాటి శివ, గజ్జి సత్యనారాయణ, ఈడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.