Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మండలంలోని నక్కల గరువుబు గ్రామ పంచాయతీలో వర్షపు నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తూ ఇళ్లల్లోకి వస్తున్నాయని గ్రామస్తులు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు పంచాయతీ పాలక మండలికి మండల అభివృద్ధి కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాధుడే కరువయ్యారని సిపిఎం మండల నాయకులు శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నేలపాల కోటేశ్వరరావు, నారిశెట్టి శ్రీనివాసరావు, అనంతుల నవీన్, నాంపల్లి సాయి పాల్గొన్నారు.