Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
పంచాయతీలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరపటంలు పాలకపక్షం అధికారులు విఫలమయ్యారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాస నరేష్ విమర్శించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభలో పార్టీ అధ్యయన బృందం ద్వారా గ్రామపంచాయతీలో పరిధిలో పేరుకు పోయిన 36 రకాల సమస్యలపై గ్రామపంచా యతీ పాలకవర్గానికి ఆ గ్రామ సభకు హాజరైన ఎంపీడీవోకి సమస్యల వినతిపత్రం అందించి, ధర్నా చేయగా 15 రోజుల్లో గ్రామపంచాయతీలో ఉన్న సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నేటికీ 45 రోజులు కావస్తున్నా గ్రామపంచాయతీలో నెలకొని ఉన్న సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఆ సమస్యలపై నేడు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో టౌన్ శాఖ కార్యదర్శి రాయి రాజా తదితరులు పాల్గొన్నారు.