Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ, సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ డే కేర్ సెంటర్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మెన్ డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ అధ్యక్షతన గురుపూజోత్సవం ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు హాజరై సభను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. ప్రథమంగా త్రీ లేయర్ మాస్క్‌లను ఆవిష్కరించి సభలో ఉన్న వారికి పంపిణీ చేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా సమాజంలో నిలిపే వారే ఉపాధ్యాయులు అన్నారు. ఇంతమంది విశ్రాంత ఉపాధ్యాయులు వేదిక కారణ మైన ఐఆర్సీఎస్ సీఓ, ప్రత్యేకంగా చైర్మెన్ చంద్రమోహన్‌ను అభినందించారు. ఈ కార్యక్ర మంలో మొత్తం 37 మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సమావేశానికి సంయుక్త అధ్యక్షులు శ్రీ రవీందర్ రావు, శ్రీహరి నరసయ్య, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు, ఐఆర్సీఎస్ కోశాధికారి గోవర్ధన్ రావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శంకర్రా వు సమావేశానికి ఆహ్వానం పలికారు. రాధాకృష్ణ, ఉపేంద్ర రావు, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణ, కుటుంబరావు, సత్యనారాయణ, ఉప్పలయ్య కార్యాలయ ఇన్చార్జ్ పాల్గొన్నారు.