Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురి గురువులకు సన్మానం
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మెల్విన్ జోన్ గ్రంధాలయంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎంఈవో వీరాస్వామి, సింగరేణి ప్రధానోపాధ్యయురాలు స్వరూపరాణి, మణుగూరు కో ఎడ్యూకేషన్ ప్రధానోపాధ్యాయులు పటేల్ లకీëనారాయణ, ఎం.జ్యోతి, వివి.కోటేశ్వరరావు, భుక్యతారలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం. నాగేశ్వరరావు, కార్యదర్శి పూర్ణచందర్రావు, హరిబాబు, రమేష్, చంద్రమోహన్, డాక్టర్ సమ్మయ్య, పుల్లయ్య, ప్రసాద్ తదితరుల పాల్గొన్నారు.
దివ్యాంగుల పాఠశాలలో : మండలంలోని సంతోష్‌నగర్‌లో గల సత్యసాయి దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితి, దివ్యశ్రీ, చుర్షిక, స్వాతిక్, సాయికిరణ్ పాల్గొన్నారు.
తల్లాడ : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగేష్, వెంకటరెడ్డి, వెంకటయ్య, సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : తరగతి గది నుండి దేశ భవిష్యత్తుని నిర్ణయించే పౌరులను తయారు చేసే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులకు చేయూత నివ్వడం చాలా సంతోషం కలిగిందని జేడీ ఫౌండేషన్ భాద్యుడు మురళీ మోహన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరంలోని ఆదివారం మడోనా ప్రాథమిక పాఠశాల నందు ఉన్న ఉపాధ్యాయులకు సుమారు 25 మందికి నిత్యావసర వస్తువుల్ని ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ చక్రధర్ మాట్లాడారు. ఫౌండేషన్ సభ్యురాలు హన్సి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు పవన్ కుమార్, కడాలి నాగరాజు, రాంప్రసాద్ రెడ్డిలు ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ఈ సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా హన్సి మాట్లాడుతూ డా.రాజశేఖర్, స్పందన, ఆకునూరి రమ ణారావు, నాగ మోహన్, స్రవంతి ఇతర జేడీ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూపారాణి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో పలువురు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. ఉపాధ్యాయులే దేశానికి దిశానిర్దేశం చేస్తారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోట మధుసూదన్ రావు, కార్యదర్శి చలపతిరావు, కోశాధికారి విద్యాసాగర్, పూర్వ అధ్యక్షులు సానికోమ్ము బ్రహ్మారెడ్డి, రఫీ, చైతన్య, రవి కుమార్, శేఖర్, ప్రోగ్రామ్ చైర్మెన్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు : జూలూరుపాడుకి చెందిన దారెల్లి కరుణకుమారి, రమేష్ దంపతులకు గురుపూజోత్సవం సందర్భంగా మథర్ థెరిస్సా బీఈడీ కాలేజ్ పాల్వంచ నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహి ంచారు. ఈ కార్యక్రమంలో దారెల్లి కరుణ కుమారి గణిత ఉపాధ్యాయురాలుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా బీఈడీ కాలేజ్ యాజమాన్యం డాక్టర్ సుధాకర్, కరస్పాండెంట్ నాగేశ్వరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : మండలంలోని పలు, ప్రభుత్వ ప్రైవేటు పాటశాలల్లో గురుపూజోత్సవ దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులు రాధా కృష్ణన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు స్వీట్లు అందజేశారు.
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేత
గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని గురువులకు చేయూత నివ్వాలనే లక్ష్యంతో లకీëనగరం మడోన్నా ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసరాలు అందజేశారు. మొత్తం 25 మందికి ఫౌండేషన్ భాద్యులు మురళీమోహన్ కుమార్ పది రోజులకు సరిపడా నిత్యవసరాలు అందజేశారు. పాఠశాల కరస్పాడెంట్ చక్రాధర్ మాట్లాడారు. పౌండేషన్ సభ్యులు హాన్సి, పవన్ కుమార్, కడాలి నాగరాజు, రాంప్రసాద్ రెడ్డితో పాటు ఉపాద్యాయులు, బోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం : ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీదేవి పల్లి మండలంలోని సెంట్రల్ పార్క్‌లో ఉపాధ్యాయ రంగంలో సేవలు అందిస్తున్న వారిని సన్మానించారు. విద్యాబోధనలో ఉత్తమమైన సేవలు అందిస్తున్న వారికి శాలువాలు, పూల బొకేలతో సన్మానించారు. మెమోంటో అందజేశారు. ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ ఎస్జీఎఫ్ఐ జిల్లా విభాగం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్ సుంకర కొండరావును సన్మానించారు. అయనతో పాటు సీడిపిఓ కనకదుర్గ, అంగన్వాడీ టీచర్ పి.పద్మ, అంకం శ్రీశైలం, జరీనాబీ, ఎం.జ్యోతిరాణి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా ముఖ్య బాధ్యులు లోగాని శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాస్, విజరు కుమార్, మాజీ సైనిక అధికారి ఎస్కె.ఖాదర్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : ప్రపంచంలో వృత్తుల్లో కన్నా ఉపాధ్యాయ వృత్తి విశిష్టమైనదని, ప్రతీ ఒక్కరికీ తల్లిదండ్రులు తర్వాతి స్థానం గురువులుదేనని లైన్స్ క్లబ్ మండల అధ్యక్షులు కొఠారు చలపతి రావు అన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని 80 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసారు. అనంతరం మండల విద్యాధికారి క్రిష్ణయ్యను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమృతవల్లి కోటేశ్వరరావు, ఎంపీపీ శ్రీరామమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయులు, పీఏసీఎస్ అశ్వారావుపేట అధ్యక్షులు నూతక్కి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.