Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విలువ రూ.26 లక్షలు
అ రెండు వేర్వేరు కేసుల్లో 10 మంది అరెస్టు
అ వివరాలు వెల్లడించిన ఏఎస్పీ వినీత్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో పోలీసులు రెండు వేర్వేరు కేసులలో 130 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన గంజాయి విలువ రూ.26 లక్షలు వుంటుందని, ఇందులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు సోమవారం ఏయస్పీ జి.వినీత్ వెల్లడించారు. పట్టణ సీఐ స్వామి తన సిబ్బందితో కలిసి ఆర్టీసీ బస్టాండ్ భద్రాచలంలో పెట్రోలింగ్ నిర్వహించారు. 30 కేజీల గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈ సందర్భంగా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి, మహారాష్ట్రలకు చెందిన అన్సార్ ఖాన్, ముంతాజ్ బోనో, ఒక బాల నేరస్థురాలు వున్నారు. ఈ క్రమంలో వీరందరు ఈ గంజాయిని ధారకొండ నుండి మహారాష్ట్రకు తీసుకువెళ్తున్నారని పోలీసులు విచారణలో తేలిందన్నారు. ఈ గంజాయి విలువ రూ.ఆరు లక్షలు వుంటుందని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా సోమవారం 10.30 గంటల సమ యంలో పట్టణ ఇన్స్పెక్టర్ టీ.స్వామి తన సిబ్బందితో ఆర్టీసీ బస్టాండ్ నందు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఏడుగురు వ్యక్తులు తమ లగేజి బ్యాగులల్లో గంజాయి తరలిస్తుండడాన్ని గమనించి, వారిని విచారించారు. వీరి వద్ద 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ.20 లక్షలు వుంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఒడిశాకు చెందిన ఫర్జానా సలీం సయెద్, కరీం, షాజద్, మారుతి బండ్రే, మజీద్ పఠాన్, జాఫర్ రజాక్, లక్ష్మి సంతోష్ తాంబేలు గంజాయిని ముంబైకి తీసుకువెళ్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వీరందరిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఏయస్పీ మాట్లాడుతూ పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. నిషేదిత వస్తువులు అయిన గంజాయి, మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.స్వామి, పట్టణ ఎస్ఐ ప్రొబెషనరీ బి.రంజిత్ సిబ్బంది పాల్గొన్నారు.