Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలానికి చెందిన శనగ అంజలి సోమవారం కురిసిన భారీ వర్షానికి వరద నీటిలో కొట్టుకపోయి మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికలాంగుల కాలనీకి చెందిన శనగ రవి, నాగమణి దంపతులకు ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి తేజ, రెండవ అబ్బాయి మణికంఠ, మూడవ అమ్మాయి అంజలి(7). తల్లిదండ్రులు కూలిపని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి మణికంఠ, అంజలి అన్న చెల్లెలు వరద నీటిలో కొట్టుకపోతుంటే మణికంఠను స్ధానికులు కాపాడారు. అంజలి కొట్టుకపోయి చనిపోయింది. చేపలు పట్టే వల వేసి వెతకగా.. ప్రాణాలు కోల్పోయి వలలో చిక్కింది. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పాల్వంచ తహశీల్దార్ స్వామి హాస్పిటల్కు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి ఏమైనా రెమ్యునరేషన్ వుంటే అందించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.