Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం పేరుపల్లి, అనంతారంతండా, తొడితలగూడెం, కొత్తూరుతండా, గేటుకారేపల్లి, కారేపల్లి గ్రామాలకు వెళ్లే రహదారులపై నీరు పొంగి పోర్లిపోతుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పేరుపల్లి వద్ద బ్రిడ్జిపై నుండి నీరు పొంగిపోతుండటంతో మాధారం వెళ్ళు బస్ కారేపల్లిలోనే నిలిపి వేస్తున్నారు. తొడితలగూడెం చెరువు అలుగు విరీతంగా పోతుండటంతో ఇల్లందు నుండి తొడితలగూడెం వెళ్ళు రహదారి ని సర్పంచ్ బానోత్ కుమార్ ఆధ్వర్యంలో మూసివేశారు. అనంతారంతండా వద్ద బ్రిడ్జి పై నుండి నీళ్లుపోతుండటంతో ఇల్లందు ఆర్Êబీ రోడ్ నుండి ఆ గ్రామాన్ని రాకపోకలను నిలిపివేశారు. రహదారులపై నీరు చేరిన ప్రాంతాలను తహసీల్ధార్ డీ.పుల్లయ్య, సీఐ బాణాల శ్రీనివాసులు, ఎస్సై పీ.సురేష్ సందర్శించారు.
నీట మునిగిన పంటలు
భారీ వర్షాలకు పంటల నీటి మునిగాయి. పాటిమీదిగుంపు, చీమలపాడు, బాజుమల్లాయి గూడెం, కారేపల్లి ప్రాంతాల్లో వాగులు పొం గటంతో పంటలు నీటమునిగాయి. పాటిమీది గుంపు ప్రాంతాల్లో పంటల నెలమట్ట మయ్యాయి. పాటిమీదిగుంపు, చీమలపాడు, భాగ్యనగరతండా గ్రామాల్లో ఇండ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. కారేపల్లిలో అంబేద్కర్‌నగర్‌లో రోడ్డు చెట్టు పడిపోయింది. అసమయంలో అక్కడ ఎవరు లేక పోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.