Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి డైరక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా పివికే-5 భూగర్భగనిలో వెంటిలేషన్ ఫ్యాన్‌ను సింగరేణి డైరక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడారు. నూతనముగా ఏర్పాటు చేసిన వెంటిలేషన్ ద్వారా ప్రతి నిమిషం 3 లక్షల క్యూబిక్ మీటర్ల గాలిని గనిలోపల పనిచేస్తున్న కార్మికులకు పంపించ గలమని తెలిపారు. వెంటిలేషన్ ఫ్యాన్‌ను ప్రారంభించటం చాలా సంతోషముగా ఉంది అని, భూ గర్భ గనులలో చాలా లోతుగా వెళ్ళటం వలన ఉష్ణోగ్రతలను తగ్గించటానికి వెంటిలేషన్ అనేది ముఖ్య భూమిక పోసిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం సిహెచ్.నరసింహా రావు, అధికారులు దేవి కుమార్, గురవయ్య, కుమార స్వామి, కార్మిక సంఘం నాయకులు ఎండి.రజాక్, రఘు రామి రెడ్డి, రవీందర్, సూర్యనారాయణ, గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంటిటేషన్ మిషన్ ఏర్పాటు ప్రత్యేక అధికారి గోలి వెంకటేశ్వర్లు, కె.రాజేశ్వర రావు, హెచ్‌ఓఎం, సూర్య తేజ, శ్రీనాధ్, ఎం.గోపిలను ఘనంగా సన్మానించారు.