Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రతీ ఏటా 50 లక్షల టన్నుల ఉత్పత్తి పెంపుదల
అ 2023-24 నాటికి 850 లక్షల టన్నుల ఉత్పత్తికి సింగరేణి చేరాలి
అ కొత్త గనులపై ప్రత్యేక సమీక్షలో చైర్మెన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి సంస్థలో రానున్న మూడేండ్ల కాలంలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులు వంటివి త్వరితగతిన పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన ప్రగతిపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించడం జరుగుతుందని సంస్థ చైర్మెన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ తెలియజేశారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరామ్, డ్కెరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావుతో పాటుతో పాటు అడ్వ్కెజర్లు, ఈడీ (కోల్‌మూమెంట్), ప్రాజెక్టు ప్లానింగ్, ఎస్టేట్స్, మార్కెటింగ్ తదితర శాఖల జిఎంలు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్‌తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్న జీడీకే-5 ఓపెన్ కాస్టు, జేవీఆర్ ఓసి-2 ఎక్స్టెన్షన్, న్కెనీ ప్రాజెక్టు కలిపి 10 మిలియన్ టన్నులు సాధించాల్సిన ఉత్పత్తి లక్ష్యాలతో పాటు రానున్న మూడేళ్లలో ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్టులపై ఆయన ప్రాజెక్టుల వారీగా లోతుగా సమీక్షించారు.
2021-22 లో ప్రారంభించనున్న జీడీకే కోల్ మైన్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు బొగ్గు, న్కెనీ బొగ్గు బ్లాక్ (ఒడిశా) నుంచి 100 లక్షల టన్నులు, తదుపరి సంవత్సరాలలో వీకే కోల్ మైన్ నుంచి 53 లక్షల టన్నులు, ఆర్జీ కోల్ మైన్ (జీడీకే-10) నుంచి 60 లక్షల టన్నులను వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలుగా ప్రతిపాదించడం జరిగిందనీ, కనుక ఈ గనులకు సంబంధించిన మిగిలిన అనుమతులను వేగవంతం చేయాలన్నారు.
కాగా 2022-23 సంవత్సరంలో ప్రారంభించాల్సి ఉన్న ఐదు గనులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఆదేశించారు. ఈ గనులకు అనుమతులు లభించిన అనంతరం నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే 2023-24 నాటికి సింగరేణి సంస్థ 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడ్వ్కెజర్ (మైనింగ్) డీఎన్.ప్రసాద్, అడ్వ్కెజర్ (ఫారెస్ట్రీ), సురేంద్ర పాండే, ఈడీ (కోల్ మూమెంట్), జె.ఆల్విన్ జీఎం (కో ఆర్డినేషన్), కె.సూర్యనారాయణ, జీఎంలు పాల్గొన్నారు.