Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అధికారులతో వర్షముంపు
ప్రాంతాల్లో కలెక్టర్ పరిశీలన
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో వర్షపు నీరు నిల్వలు వల్ల ప్రజల ఇండ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టర్ రామవరంలోని ఎస్సీబి నగర్లో నీట ముగిసిన ఇండ్లను పరిశీలించి నీరు వెళ్లడానికి చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట మునిగిన ఇండ్ల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన కలెక్టర్ తక్షణమే జెసిబి ఏర్పాటు ద్వారా నీరు వెళ్లడానికి అడ్డుగాఉన్న గోడలను, మంటిని తొలగింపు చర్యలను చేపట్టామని చెప్పారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇరిగేషన్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి నివేదికలు అందచేయాలని చెప్పారు. నీరు సక్రమంగా వెళ్లడానికి అవకాశం లేకుండా నాళాలు, మురుగు కాల్వలపై నిర్మించిన నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. రానున్న మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నందున యంత్రాంగం ముందస్తుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి అర్జున్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డీఈ నవీన్, తహసిల్దార్ రామకృష్ణ, వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు భారీ వర్షాలు నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. పొంగిపొర్లుతున్న వాగులకు 100 మీటర్లు దూరంలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రసవ తేదీలు సమీపంలో ఉన్న మహిళలను ముందస్తుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించాలని చెప్పారు. ప్రాణ నష్టం కాకుండా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశువులను ఇంటి వద్దే జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, జడ్పీ సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఏ పిడి మధుసూదన్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.